NLG: కనగల్ మండలం దర్వేశిపురంలోని పర్వతగిరి రేణుక ఎల్లమ్మ ఆలయంలో ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు తమ మొక్కుబడులు తీర్చుకునే భాగంగా అమ్మవారికి కల్యాణోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నాగిరెడ్డి, అర్చకులు నాగోజు మల్లాచారి, సిబ్బంది కోణం ఉపేందర్ రెడ్డి, నకిరేకంటి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.