BPT: బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం గురించి కలెక్టర్ వినోద్ కుమార్ ఆదివారం వివరించారు. ప్రతి మండల స్థాయి, రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో కూడా PGRS కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారానికి ఈ వేదికను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు.