HYD: ‘ది సిటిజన్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్’ బ్యాంకులో నకిలీ బంగారం తాకట్టు పెట్టి రూ.3.19 కోట్ల రుణాలు పొందిన మోసం వెలుగులోకి వచ్చింది. S.R నగర్ బ్రాంచ్ మాజీ మేనేజర్ ఆర్.చంద్రశేఖర్, ప్రధాన నిందితుడు నాగ విశ్వేశ్వర రావు కలిసి బినామీ పేర్లతో 39సార్లు రుణాలు తీసుకున్నారు. విచారణలో విషయం తేలడంతో, బ్యాంకు ఎండీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.