ప్రకాశం: కనిగిరి మండలం, లింగారెడ్డి పల్లెలో జీఎస్టీ ధరల తగ్గింపుపై లింగారెడ్డి PACS ఛైర్మన్ కమతం వెంకటేశ్వర రెడ్డి ఆదివారం స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వం నాలుగు స్లాబులుగా ఉన్న జీఎస్టీని రెండు స్లాబులుగా విధించడంతో వస్తువుల ధరలు బాగా తగ్గాయన్నారు. వ్యాపారులు తగ్గిన వస్తువుల ధరలను ప్రజలకు వివరించాలని కోరారు.