గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో రేపు ‘డయల్ యువర్ కమిషనర్’, PGRS కార్యక్రమాలు జరుగుతాయని కమిషనర్ పులి శ్రీనివాసులు ఇవాళ తెలిపారు. DYC కార్యక్రమం ఉదయం 9:30 నుంచి 10:30 గంటల వరకు జరుగుతుంది. ప్రజలు 0863-2224202 నంబర్‌కు డయల్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చు. ఆ తర్వాత, మధ్యాహ్నం ఒంటి గంట వరకు PGRS కార్యక్రమం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.