TG: కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఆయన విగ్రహానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాళులర్పించారు. ఆయన వెంట టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి, తదితరులు ఉన్నారు. బడుగు బలహీన వర్గాలకు వెంకటస్వామి అండగా నిలిచారని, కేంద్రమంత్రిగా, రాష్ట్రమంత్రిగా కాకా చేసిన సేవలు మరువలేనివని భట్టి కొనియాడారు.