పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై నటి రాశి ఖన్నా ప్రశంసలు కురిపించారు. పవన్ కళ్యాణ్ పేరు లాగే ఆయన వ్యక్తిత్వం కూడా పవర్ఫుల్ అని అన్నారు. ఆయనతో కలిసి పనిచేసిన తర్వాత ఆయన స్వభావం, మానవత్వం మరింత అర్థమైందని, ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచిస్తూ, ఎన్నో పుస్తకాలు చదువుతుంటారని చెప్పారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీలో ఆయన పార్ట్ పూర్తయిందని తెలిపారు.