WGL: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా నిలిపివేయబడింది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ప్రజావాణి నిర్వహణ నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. ప్రజలు గమనించాల్సిందిగా కోరారు.