HNK: నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఆదివారం పరామర్శించారు. హన్మకొండలోని మాధవరెడ్డి గారి స్వగృహానికి చేరుకున్న సారయ్య ఇటీవల కన్నుమూసిన మాధవరెడ్డి తల్లి కాంతమ్మ పార్థివదేహంపై పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.