KMM: తల్లాడ మండలం మల్లవరం గ్రామ రైతులు నిరసన వ్యక్తం చేశారు. మా సమస్యను పరిష్కరించండి- ఓట్లు అడగండి అంటూ వినూత్న రైతులు నీటిలో దిగి నిరసన వ్యక్తం చేశారు. పంట పొలాలకు వెళ్లే మార్గాలకు రహదారి, పక్కనే కల్వర్టు సమస్యను పరిష్కరించాలని పలుమార్లు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.