ATP: జర్నలిస్టుల స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో నాలుగు రోజులపాటు జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ టోర్నీకి మంత్రి సత్యకుమార్ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, JSAAP జిల్లా గౌరవాధ్యక్షుడు రేపటి రామాంజనేయులు పాల్గొన్నారు.