ATP: గుత్తి కోటపై ఉన్న దిడ్డి కుంట, తాడిపత్రి రోడ్డులోని తురబ్ షా కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. ఇటీవల వరుసగా కురిసిన వర్షాలకు కుంటల్లోకి నీరు సమృద్ధిగా చేరింది. కుంటలలో నీరు సమృద్ధిగా ఉండడంతో చుట్టుపక్కల బోర్లలో నీళ్లు పుష్కలంగా లభిస్తాయని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 4 సంవత్సరాలు తర్వాత కుంటలు పూర్తి స్థాయిలో నిండాయన్నారు.