MBNR: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో సమిష్టిగా పనిచేసే సత్తా చాటుదామని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అధ్యక్షతన నిర్వహించిన పదాధికారుల సమావేశంలో ఎంపీ పాల్గొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.