ఏలూరు: జంగారెడ్డిగూడెం బైనేరు వాగు వద్ద ఈనెల 3న పాత నేరస్తుడు కర్రి రాజేష్( 26) అనే వ్యక్తిని హత్య చేసిన ఆరుగురు వ్యక్తులను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై పలు పోలీస్ స్టేషన్లో పాత కేసులు ఉన్నాయన్నారు. నిందితుల వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన చాకులు, మూడు ద్విచక్ర వాహనాలు, సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.