KMR: నాగిరెడ్డిపేట మండలంలో వరద ముంపుకు గురి అయిన పంటలను ఆదివారం మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. వరద నీరు రావడంతో నెల రోజుల నుంచి తమ పంటలు ముంపులో ఉన్నాయని రైతులు మాజీ మంత్రి దృష్టికి తెచ్చారు. పంట నష్టం పోయిన రైతులకు ప్రభుత్వం తగిన పరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. నెలరోజులైన ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.