AKP: రావికమతం కేంద్రంగా పనిచేస్తున్న 108 అంబులెన్స్ పూర్తిగా పనిచేయని స్థితికి చేరింది. ఐదు ఏళ్ల క్రితం మండలానికి కేటాయించిన సెకండ్ హ్యాండ్ వాహనం మరమ్మతులతోనే ఇంతకాలం సేవలు అందించింది. ఆదివారం నుంచి వాహనం కదలలేని స్థితిలో ఉందని సిబ్బంది తెలిపారు. దీంతో ప్రమాదాల సమయంలో ఇతర మండలాల నుంచి 108 వాహనాలు రావాల్సివస్తోంది.