GNTR: తుళ్లూరు మండల TDP అధ్యక్ష పదవి కేటాయింపులో అధిష్ఠానం జాప్యం చేస్తుండటంతో తెలుగు తమ్ముళ్లు నిరాశలో ఉన్నారు. గత నెల 15న జిల్లా పార్టీ కార్యాలయంలో అధ్యక్షత పదవి కోసం అభిప్రాయాలు సేకరించారు. అదే రోజు తుళ్లూరుతో పాటు తాడికొండకి సంబంధించిన అభిప్రాయ సేకరణ కూడా జరిగింది. అయితే, తాడికొండ అధ్యక్షుడిని ఇప్పటికే ప్రకటించగా తుళ్లూరులో జాప్యం జరుగుతుంది.