KRNL: దేవరగట్టు శ్రీ మాలమళ్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవాల నేపథ్యంలో 4వ రోజు జరిగే గురవయ్యల గొలుసు తెంపు కార్యక్రమం భక్తుల కోలహలాల మధ్య వైభవంగా జరిగింది. బొల్లూరు గ్రామానికి చెందిన గాదిలింగ సుమారు 4 మీటర్ల పొడవున్న ఇనుప గొలుసును 4 జఠికీలతో తెంపారు. అనంతరం గురవయ్యల నృత్యాలు, దేవదాసీల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.