MDK: కౌడిపల్లి తునికి గ్రామంలో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నల్ల పోచమ్మ దేవస్థానంలో త్రయోదశి ఆశ్వయుజ మాసం సందర్భంగా ఆదివారం ఆలయ అర్చకులు అమ్మవారికి పట్టువస్త్రాలు, నిమ్మకాయల దండ, వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు. ఒడి బియ్యం, నైవేద్యం సమర్పించి అష్టోత్తర సహస్రనామ పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు.