KMM: ఓ వృద్దురాలి ఇంట్లోకి గుర్తుతెలియని దుండగులు చొరబడి బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన ఘటన తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గోకినపల్లి లచ్చమ్మ అనే మహిళ ఇంట్లో ఒంటరిగా ఉండగా.. గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు ఆమె ఇంట్లోకి చొరబడి పెప్పర్ స్ప్రే ముఖానికి కొట్టి మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు.