VZM: జానపద కళలతో కనువిందు చేస్తూ, కళా రూపాలతో మైమరిపింప జేస్తూ, విచిత్ర వేషధారణలతో ఆకట్టుకుంటూ విజయనగర ఉత్సవ శోభాయాత్ర శోభాయమానంగా జరిగింది. విజయనగర ఉత్సవాల ప్రారంభానికి సంకేతంగా పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద ఆదివారం ఉదయం మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం కోట వద్ద ప్రముఖులు ఆశీన్నులై కళా రూపాలను తిలకించారు.