WGL: దుగ్గొండి మండల కేంద్రంలోని రాజ్య తండా, గోబ్రియా తండాకు చెందిన BRS పార్టీ నాయకులు ఆదివారం బీజేపీ జిల్లా కార్యదర్శి డా. రాణా ప్రతాప్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా డా. రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ప్రజలు గుర్తిస్తున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికలో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని ప్రజలను కోరారు.