రోజూ పంట పొలాల్లో శ్రమించే ఓ రైతు KBC షోలో అమితాబ్ బచ్చన్ అడిగిన 14 ప్రశ్నలకు సమాధానమిచ్చి ఏకంగా రూ.50లక్షలు గెలుచుకున్నాడు. MH హింగోలి జిల్లాకు చెందిన కైలాశ్ కుంటేవార్ KBC 17వ ఎపిసోడ్లో కోటి రూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పడంలో సందిగ్ధ పడ్డాడు. దీంతో రిస్క్ తీసుకోలేక పోటీ నుంచి తప్పుకున్నాడు. ఒకప్పుడు వినోదం కోసమే KBC చూసిన కైలాశ్ తలరాతను అదే షో మార్చేసింది.