మన్యం: అకాల వర్షాలకు దెబ్బతిన్న అరటి, మొక్కజొన్న పంటలను మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర పరిశీలించారు. సాలూరు మండలంలోని తోనాము, కందులపదం గ్రామాల్లో పర్యటించారు. పంటలు నష్టపోయిన రైతులను ఆదుకొని వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.