మన్యం: వారం రోజులుగా పార్వతీపురం మండలంలో తిష్ట వేసి గ్రామస్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఏనుగుల గుంపు ప్రస్తుతం లక్ష్మీనారాయణపురం సమీపంలో ఉంది. చినమరికి, పెద్దమరికి, బండిదొరవలస గ్రామాల్లో రైతులకు పంట నష్టం కలిగించిన గజరాజులు తమ గ్రామంలోకి ప్రవేశించకుండా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.