TG: సామాన్య ప్రజలంటే సీఎం రేవంత్ రెడ్డికి ఎందుకంత కోపమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రశ్నించారు. బస్సు ఛార్జీల పెంపుపై ఆమె ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. ఇటీవల బస్సు పాస్ ధరలు పెంచి చిరుద్యోగులపై పెనుభారం మోపారు, ఇప్పుడు బస్సు ఛార్జీలను అమాంతం పెంచేశారని మండిపడ్డారు. గ్రీన్ జర్నీ పేరుతో సామాన్యుల రక్తాన్ని పీల్చేస్తున్నారని ఆరోపించారు.