చిత్తురు నగరంలో ఆదివారం ‘బాబు ష్యూరిటీ-మోసం గ్యారెంటీ’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వైసీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి తెలిపారు. ‘బాబు ష్యూరిటీ-మోసం గ్యారెంటీ’ కార్యక్రమాన్ని నగరంలోని 4 వ వార్డు కట్టమంచిలో ఉన్న పెరుమాళ్ గుడి వీధిలో జరుగుతుందన్నారు. ఉదయం 10 గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమంలో చంద్రబాబు మేనిఫెస్టో ద్వారా చేసిన మోసాలను ప్రజలకు వివరిస్తారు.