WGL: ఉమ్మడి జిల్లాలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైకుంఠ ధామాల్లో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మృతుల దహన సంస్కారాలకు నీటి సౌకర్యం అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో నిర్వహణ బాగున్నప్పటికీ, చాలా చోట్ల పట్టించుకునే వారు లేక బయట దహన సంస్కారాలు చేస్తున్నారు. ఈ సమస్యపై అధికారులు స్పందించాలని ప్రజలు ఇవాళ కోరారు.