BHPL: టేకుమట్ల మండల కేంద్రంలో ఆదివారం BSP జిల్లా అధ్యక్షుడు బిక్షపతి గౌడ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. బహుజనులను రాజ్యాధికార పీఠంపై కూర్చోబెట్టడమే బహుజన్ సమాజ్ పార్టీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. సర్పంచ్, MPTC, ZPTC ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థులను రంగంలోకి దింపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో BSP నేతలు తదితరులు ఉన్నారు.