కృష్ణా: గుడివాడలో గురురాజు హోమియోపతి కళాశాల,ఆసుపత్రి 1954లో స్థాపించబడి,1958లో ప్రభుత్వ గుర్తింపు పొందింది. ఈ కళాశాల హోమియోపతి యొక్క కేంద్ర మండలి నుంచి గుర్తింపు పొంది, బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతి మెడిసిన్ అండ్ సర్జరీ కోర్సులు అందజేస్తుంది. గుడివాడ హోమియోపతి కాలేజ్ విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవలు అందిస్తూ,హోమియోపతి వైద్యాన్ని దగ్గర చేసింది.