AKP: సిపిఎం జిల్లా కార్యదర్శి, ఎం. అప్పలరాజును పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. ఎస్.రాయవరం మండలం ధర్మవరం గ్రామానికి వెళ్లిన పోలీసులు అప్పలరాజును బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు. బీసీవై అధినేత రామచంద్ర యాదవ్, మత్స్యకారులకు సంఘీభావం తెలిపేందుకు ఆదివారం రాజయ్యపేట వస్తున్న నేపాధ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయనను గృహ నిర్బంధం చేశారు.