సూర్యాపేటలోని ఎర్కారం స్టేజ్ వద్ద నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. SRPT వైపు వెళ్తున్న స్కూటీని అర్వపల్లి వైపు వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న జిల్లా కేంద్రానికి చెందిన సారగండ్ల నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. మాజీమంత్రి అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.