E.G: రాజమహేంద్రవరం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి (జీజీహెచ్) ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతా (ఆభా) యాప్ ద్వారా రోగుల వివరాల ఆన్ లైన్ నమోదు విజయవంతంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర బోధనాసుపత్రుల్లో ఇది మూడో స్థానంలో నిలిచింది. ఆభా యాప్ ద్వారా రోగుల ఆరోగ్య చరిత్రను ఒక్క క్లిక్‌తో తెలుసుకునే అవకాశం లభిస్తోంది.