5-17 ఏళ్ల పిల్లల ఆధార్ బయోమెట్రిక్‌ను ఏడాదిపాటు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఈ మేరకు రుసుము రద్దు చేస్తున్నట్లు, ఇది ఈ నెల 1 నుంచే అమల్లోకి వచ్చినట్లు UIDAI తెలిపింది. అయితే వచ్చే OCT 1 తర్వాత రుసుము వసూలు చేస్తారు. కాగా చిన్న పిల్లలకు 5 ఏళ్ల తర్వాత ఓ సారి, 15 ఏళ్ల తర్వాత మరోసారి తప్పనిసరిగా బయోమెట్రిక్స్ అప్డేట్ చేయించాలి.