AP: విజయవాడ విద్యాధరపురంలో దారుణం జరిగింది. భార్య తనను విడిచి వెళ్లడానికి కారణమైందని పిన్నిపై పగ పెంచుకున్న ఓ వ్యక్తి ఆమెను హత్య చేశాడు. ఆపై మృతదేహాన్ని ముక్కలుగా నరికి మురుగు కాల్వలో పడేశాడు. మృతురాలి మొండెం స్థానికులకు కనిపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. CC ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు హత్య, నిందితుడి ఆచూకీ తెలుసుకుని అదుపులోకి తీసుకున్నారు.