GNTR: గుంటూరు కొత్తపేట ఉమామహేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్, ఆలయ నూతన ఛైర్మన్ శేషతల్పసాయితో సహా కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..నూతన కమిటీ ఆలయాల పవిత్రతను కాపాడుతూ భక్తులకు సదుపాయాలు కల్పించాలని సూచించారు.