WGL: నల్లబెల్లి మండల పరిధిలో రుద్రగూడెం గ్రామంలో నిన్న అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానిక రైతు K జనపతి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి, గ్యాస్ సిలిండర్ ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ దొంగతనం జరిగినట్లు భావిస్తున్నారు. ఉదయం ఇంటి తలుపులు తెరిచి చూసేవరకు గ్యాస్ సిలిండర్ లేకపోవడంతో దొంగతనం జరిగినట్లు గుర్తించారు.