MPలోని చింద్వారాలో దగ్గు మందు తీసుకున్న 10 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ దగ్గు సిరప్‌ను సూచించిన డా.ప్రవీణ్ సోనిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున డాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. బాధిత చిన్నారుల్లో చాలా మందికి దగ్గు మందును సూచించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు.