SRD: సిర్గాపూర్ మండలం లక్ష్మణ్ నాయక్ తండాలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తండాలో నీటి పథకం బోర్లు లేవు. దాంతో పంచాయతీ కార్యదర్శి బ్రహ్మంచారి స్పందించి ట్యాంకర్ ద్వారా ప్రజలకు తాగునీరిచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. గ్రామానికి శాశ్వతంగా మంచి నీటి సరఫరాకు కొత్తగా బోర్లు వేసి నీరందిస్తే సమస్య తొలుగుతుందని గ్రామస్తులు నేడు తెలిపారు.