ADB: బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామస్తులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను నేరడిగొండలోని ఆయన నివాసంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ గ్రామంలో గల శబరిమాత ఆలయం వద్ద షెడ్డు నిర్మించాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను కోరారు. షెడ్డు ఏర్పాటుకు తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తారని ఎమ్మెల్యే గ్రామస్తులకు తెలిపారు.