MNCL: జన్నారం మండల కేంద్రంలోని జ్యోతి గార్డెన్లో సోమవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి దుర్గం రాజలింగం తెలిపారు. మండల వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శిబిరాన్ని నిర్వహిస్తామని చెప్పారు.