శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి స్థిరంగా కొనసాగుతోంది. అధికారులు 10 గేట్లు ఎత్తి 2,21,296 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 2,95,531.. ఔట్ ఫ్లో 2,92,272 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 884.1 అడుగులుగా, నీటి నిల్వ 210.52 టీఎంసీలుగా ఉంది.