KMM: మధిర మండలం తొండలగోపవరం గ్రామ పంచాయతీ తొర్లపాడు- మినవోలు రోడ్లో ఆదివారం ఉదయం రెండు ఆటోలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. ఖమ్మంపాడు గ్రామానికి చెందిన కూలీలు వెంకటాపురంలో పనికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.