KDP: చిత్తూరు జిల్లాలోని కేవలంపేటలో గ్రామంలో కొందరు దుండగులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడం బాధాకరం. అటువంటి వారిని పోలీసు అధికారులు వెంటనే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఖాజీపేట మండలానికి చెందిన జిల్లా ఎంఎస్పి సీనియర్ నాయకులు మరియన్న, జయరాముడు,ఎమ్మార్పీఎస్ నాయకులు విజయ భాస్కర్లు డిమాండ్ చేశారు.