BDK: శనివారం భద్రాద్రి జిల్లా కలెక్టరేట్లో కిసాన్ యాప్ పై రైతులకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు అవగాహన కల్పించారు. డిజిటల్ టెక్నాలజీ వినియోగం ద్వారా రైతులు మధ్యవర్తుల దుర్వినియోగం నుంచి రక్షించబడతారని వారు అన్నారు. ఈ యాప్ ద్వారా మార్కెట్ లావాదేవీలపై స్పష్టమైన సమాచారం అందుకోవచ్చని అన్నారు. ఈ యాప్ రైతుల చేతుల్లో సమాచార శక్తిని అందిస్తుందన్నారు.