MNCL: ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంఛార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ శనివారం రాత్రి జన్నారం మండలం కామన్పల్లి గ్రామంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.