SKLM: ఆమదాలవలస పట్టణ శివారులోని సొట్టవాని పేట వద్ద శనివారం పేకాట శిబిరం పై పోలీసులు దాడి చేశారు. ఎస్సై ఎస్.బాలరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో ఆరుగురు పేకాట రాయుళ్లును పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు. వారి వద్ద నుంచి రూ.9,050 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని, ఈ ఘటన పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.