పురుషులతో పోలిస్తే మహిళల్లో గుండెపోటు మరణాలు తక్కువ. మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల సహజ రక్షణ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ని వృద్ధి చేసి.. గుండెకు రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చూస్తుంది. అయితే, వివిధ కారణాలతో మహిళల్లోనూ గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముందే జాగ్రత్తలు తీసుకుంటే నివారించవచ్చన్నారు.