E.G: జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు శనివారం రాజనగరం రాధేయపాలెంలో బాణసంచా గోదామును నార్త్ జోన్ డీఎస్పీ వై. శ్రీకాంత్ తనిఖీ చేశారు. రహస్యంగా మందుగుండు తయారీ, నిల్వ, విక్రయాలు చేసిన వారికి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీపావళి వేడుకలలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.