చాలా మంది ఆలస్యంగా బ్రేక్ ఫాస్ట్ చేస్తారు, లేదా అసలికే మానేస్తారు. ఇలా చేయడం ఆరోగ్యంతోపాటు ఆయుష్సుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. రోజూ ఆలస్యంగా తినడం వల్ల హర్మోన్ల రిథమ్ దెబ్బతింటుందని, అలాగే నిద్రలేమి, మైగ్రేన్ వంటి సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నాయి. రోజుకో సమయంలో చేస్తే జీర్ణవ్యవస్థపై కూడా ప్రభావం పడుతుందని చెబుతున్నాయి.